/rtv/media/media_files/2025/11/15/mahesh-babu-varanasi-2025-11-15-19-02-46.jpg)
Mahesh Babu Varanasi
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ‘SSMB 29’ చిత్రానికి టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఈవెంట్‌లో అందుకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఈ టైటిల్ అద్భుతంగా ఉందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
SSMB 29 UPDATE
ఇదిలా ఉంటే మహేశ్, రాజమౌళి కాంబినేషన్ ఫిక్స్ అయి ఎన్నో నెలలు గడిచింది. అయితే ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన పలు అప్డేట్‌లు ఇస్తూ మేకర్స్ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రియాంక చోప్రా పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ వదిలారు. అందులో ఆమె సాంప్రదాయ చీరకట్టులో.. గన్ పట్టుకుని ఉన్న యాక్షన్ లుక్ అదిరిపోయింది.
ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అనంతరం ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సింగర్ కాల భైరవ, హీరోయిన్ శ్రుతి హాసిన్ ఆలపించిన ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిచ్చింది. ఇక ఇవాళ్టి ఈవెంట్‌తో సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థమైపోయిందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇకపోతే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పాత్రలు.. వాటికి తగ్గ ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉండనున్నట్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ముచ్చట. ఏది ఏమైనా రాజమౌళి డైరెక్షన్ అంటే.. సినిమా ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
Follow Us