Varanasi Movie: ఒక్క యాక్షన్ సీన్ 30 నిమిషాలుంటుంది.. చూసి పిచ్చెక్కిపోతారు - విజయేంద్ర ప్రసాద్ ఫుల్ హైప్

మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇవాళ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టైటిల్ టీజర్‌ను వదిలారు.

New Update
Varanasi Movie story leaked

Varanasi Movie story leaked

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇవాళ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టైటిల్ టీజర్‌ను వదిలారు. దీనికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Varanasi Movie story

అదే ఈవెంట్‌లో ఈ మూవీకి కథను అందించిన రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమా గురించి, అందులోని మహేశ్ బాబు పాత్ర గురించి సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో ఆయన చెప్పినట్లు కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్ ఇస్తుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు గూస్‌బంప్స్ తెప్పించడం పక్కా అని ఆయన ఫుల్ హైప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారనే విషయానికొస్తే ‘‘ఇందులోని ఒక యాక్షన్ సీన్ దాదాపు 30 నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఇందులోని మహేశ్ బాబు విశ్వరూపం చూసి షాక్ అయ్యాను. ఒక ఎమోషన్ అనాలా, యాక్షన్ అనాలా, ఆవేషం అనాలా.. ఏం అనాలో నాకు తెలియడం లేదు.

యాక్షన్ సన్నివేశాలకు డబ్బింగ్ లేదు, సీజీ వర్క్ లేదు, రీ రికార్డింగ్ లేదు.. అయినా సరే మంత్ర ముగ్దులను చేసి పడేశాడు మహేశ్ బాబు. నేను మర్చిపోలేను.. మీరు కూడా అనుభూతి పొందుతారు.’’ అని ఈ టైటిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ గా మారాయి. ఆయన మాటలతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమైపోయిందంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. 

#mahesh babu #rajamouli #ssmb 29 #varanasi #Vijayendra Prasad
Advertisment
తాజా కథనాలు