GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీలు దూరం?

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి.

New Update
 Greater Hyderabad Municipal Corporation

Greater Hyderabad Municipal Corporation

GHMC : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా 15 మంది కార్పొరేటర్లు స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నిక కానున్నారు. అయితే పోటీలో ఉంటామని బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు వేసినప్పటికీ సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. మరో వైపు సరిపోను సభ్యులు లేకపోవడంతో బీజేపీ పోటీ చేయలేదు.

Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

నిజానికి జీహెచ్‌ఎంసీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎర్‌ వశమైనప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం గణనీయంగా తగ్గిపోయింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. అయితే ఇన్నాళ్లు సెలెన్స్‌గా పావులు కదిపిన కాంగ్రెస్‌ ఎంఐఎంతో పొత్తుకు దిగింది. దీంతో 8 మంది ఎంఐఎం నుంచి ఏడుగురు కాంగ్రెస్‌ నుంచి స్టాండింగ్‌ కమిటీకి ఎంపిక కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. అలాగే ఎంఐఎం నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దిన్, రహ్మాత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హస్తినాపురం కార్పొరేటర్ బాణోతు సుజాత నామినేషన్‌లు వేశారు. కాగా గతంలోనే హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ లు కూడా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. ఇక్కడ ప్రముఖమైన విషయం ఏంటంటే వీరిలో చాలామంది బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన కార్పొరేటర్లే.

 Also Read: Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

అయితే కాంగ్రెస్‌ నుంచి మరొకరు నామినేషన్‌ వేస్తే కాంగ్రెస్‌ కు ఏడు, ఎంఐఎంకు 8 స్టాండింగ్‌ కమిటీ పదవులు దక్కనున్నాయి. ఇక నామినేషన్‌ వేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు పోటీ నుంచి తప్పుకుంటారా? చివరివరకు పోటీలో ఉంటారా అనేది సందిగ్ధమే. అయితే పోటీచేసి ఓటమి పాలు కావడం కంటే పోటీ నుంచి తప్పుకోవడమే ఉత్తమం అని బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 41మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ పోటీకి దూరంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇస్తుందని బీఆర్‌ఎస్‌ భావించి పోటీలో నిలిచినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపినప్పటికీ అగ్రనాయకులు మాత్రం ససేమిరా అనడంతో పొత్తుకు బ్రేక్‌ పడింది.

Also Read:Horoscope Today: నేడు ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది...ఏది పట్టుకున్న బంగారమే!

 జీహెచ్‌ఎంసీలో పాలనాపరమైనా, కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో పాటు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపాలి. అందుకే ఈ కమిటీ సభ్యులుగా ఉండడానికి కార్పొరేటర్లు ఆసక్తి చూపుతారు. గడిచిన పదేళ్లుగా జీహెచ్‌ఎంసీ బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉంది. అయితే ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో పాటు ఎంఐఎం పొత్తుతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నాయి. నిజానికి ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులే ఎక్కువ ఉన్నప్పటికీ ఎక్కువమంది కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ బలం పెరిగింది. మరోవైపు ఎంఎంఐతో చేతులు కలపడంతో ఈ రెండు పార్టీలే ఏకగ్రీవంగా స్టాండింగ్‌ కమిటీ సభ్యులను కైవసం చేసుకోనున్నాయి.  దీంతో బీఆర్ఎస్, బీజేపీలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లే.

Also Read: MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు