Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న 10 గ్రాములకు రూ.100 తగ్గిన గోల్డ్ ధర రూ.10లు తగ్గింది.

New Update
Gold and silver

Gold and silver Photograph: (Gold and silver)

బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. ఆదివారం 10 గ్రాములకు రూ.100 తగ్గిన గోల్డ్ ధర సోమవారం రూ.10లు తగ్గింది. అయినా తులం బంగారం ధర రూ.86 వేల మార్క్ దాటడంతో పసిడి ప్రియులు హడలిపోతున్నారు. అవసరం ఉంటే తప్ప బంగారం షాపుల వైపు కనీసం చూడడం కూడా లేదు. కొనాల్సి వచ్చినా ఆలోచించి మరీ అడుగులు వేస్తున్నారు. 

Also Read: America-Bharat: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.79,040కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.10 తగ్గి రూ.86,210 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.78,890 గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.10 తగ్గి రూ.86,060 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Also Read: Bihar Earthquake: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి విషయానికి వస్తే.. ఆదివారం నాటి ధరలతో పోలిస్తే కిలోకు రూ.100 వరకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి నిన్న రూ.1,00,500 ఉండగా.. ఈరోజు రూ.100 తగ్గి రూ.1,00,400కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి నిన్న రూ.1,08,000 ఉండగా.. సోమవారం రూ.100 తగ్గి రూ.1,07,900కు చేరుకుంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ.78,890, రూ.86,060,చెన్నై- రూ.78,890, రూ.86,060,బెంగళూరు- రూ.78,890, రూ.86,060,ముంబై- రూ.78,890, రూ.86,060, హైదరాబాద్- రూ.78,890, రూ.86,060, విజయవాడ- రూ.78,890, రూ.86,060, ఢిల్లీ- రూ.79,040, రూ.86,210,భువనేశ్వర్- రూ.78,890, రూ.86,060లుగా ఉన్నాయి.

Also Read: Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..నేడు సెలవు ప్రకటించిన సర్కార్‌!

Also Read: KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు