/rtv/media/media_files/2025/07/30/sheep-scam-case-2025-07-30-18-17-54.jpg)
Sheep scam case
మాజీ మంత్రి తలసాని ఓఎస్‌డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.. నగదు లెక్కించేందుకు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు స్శాధీనం చేసుకున్న డబ్బు లెక్కింపు చేపడుతున్నారు.. అలాగే కళ్యాణ్ ఇంటిలో నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
Talasani Kalyan In ED Custody
హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు మరింత చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా తలసాని ఓఎస్‌డీ కళ్యాణ్ ఈడీ అదుపులోకి తీసుకుంది. కళ్యాణ్ ఇంట్లో సోదాలు అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తోకలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. రూ. 700 కోట్లు స్కామ్ జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారు. ఈడీ కార్యాలయంలో కళ్యాణ్‌ను ప్రస్తుతం విచారిస్తున్నారు.
కాగా, గత తెలంగాణ ప్రభుత్వం గొల్ల,కుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం ద్వారా సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఈ పథకం అమల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. పథకం ప్రారంభం నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు ఒక్కటై ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు ఏసీబీ నిర్ధారించింది. కొంత బినామీలకు చేరగా, మరికొంత విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూయించి ఆ డబ్బులను స్వాహా చేసినట్లు తేలింది. అంతా కలిసి ఆ మొత్తాన్ని పంచుకున్నారు.
ఈ కేసులో మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్‌డీ కళ్యాణ్ హస్తం ఉందని తేలింది. దీంతో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో రూ.700 కోట్ల వరకు చేతులు మారినట్లు తెలుస్తో్ంది. దీంతో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు కళ్యాణ్ ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.కళ్యాణ్‌ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం.
కళ్యాణ్ కుమార్, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈఓ సబావత్ రామ్‌చందర్‌తో కలిసి, నకిలీ లబ్ధిదారుల పేరిట భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, మధ్యవర్తులు అరెస్టయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసును నమోదు చేసి, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది ఈడీ.ఈ స్కీంలో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రికి సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Talasani Srinivas Yadav | telangana-sheep-distribution-scheme | sheep-distribution | Sheep Distribution Scam | latest telangana news | latest-telugu-news | telugu-news | telugu crime news