Ghar Wapasi : కారెక్కుతామంటోన్న మాజీలు..బీఆర్‌ఎస్‌లో ఘర్‌ వాపసీ

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులేమో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారంతా మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు తెలుస్తోంది.

New Update
FotoJet (55)

Ghar Wapasi

Ghar Wapasi : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులేమో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకుల మీద షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఎండలు తగ్గిపోయి వానలు మొదలైనట్టుగా.. ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీలు మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు సూచనలు అందుతున్నాయి. అధికార పార్టీలో అయితే…. అన్ని విధాలా హాయిగా ఉంటుందని జంప్‌ కొట్టినా ప్రశాంతత లేకుండా పోయిందని వాపోతున్నట్టు సమాచారం. పాత కాంగ్రెస్‌ నేతలతో నియోజకవర్గాల్లో తలనొప్పుల కారణంగా… అక్కడ ఉండలేక తిరిగి బీఆర్‌ఎస్‌ మీద మనసు పారేసుకుంటూ కలకలం సృష్టిస్తున్నారు. అటు బీజేపీ హవాకు, కాంగ్రెస్‌ విజయాలకు బ్రేక్ వేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఘర్ వాపసీ షురూ చేయాల్సిందేనని కారులో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ నోటీసులు జారీ చేశారు. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెప్పుకొచ్చారు. వాళ్లు పార్టీ మారారన్న ఆధారాలు లేవని.. ఇప్పటికీ వాళ్లు కారు పార్టీలోనే ఉన్నారంటూ చెప్పడం పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చింది. అలాగే మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి తప్ప ముగ్గురిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చూపిస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దానం, కడియంలపై మాత్రం వేటు పడుతుందని.. లేదు వాళ్లు రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరగుతుంది. మరోవైపు చాలారోజుల గ్యాప్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపు తలనొప్పులు, మరోవైపు కేసీఆర్ యాక్టివ్ కావడంతో అటు నుంచి ఇటు దూకిన నేతల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కారు దూసుకుపోతే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలు పడినట్లు సమాచారం. అందుకే మళ్లీ కారెక్కేందుకు జంపింగ్ నేతలంటూ క్యూ కట్టినట్లు అంతర్గత చర్చలు మొదలయ్యాయి.

Also Read :  డ్రగ్ పెడ్లర్‌ యువతి అరెస్ట్‌.. అడిక్ట్‌ నుంచి పెడ్లర్‌గా మార్పు

గూడెం మహిపాల్‌రెడ్డి..

గతేడాది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన చివరి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే కారెక్కబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్‌ అయినప్పటికీ మనసంతా గులాబీ తోటలోనే ఉందనేది స్పష్టం అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టిన మహిపాల్‌ రెడ్డికి అక్కడి పాత నేతలే అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో తన క్యాంప్‌ కార్యాలయంలో కేసీఆర్‌ ఫోటో తీసేదే లేదని పట్టుబట్టారు. పైగా ఇప్పుడు తానున్న పార్టీ మీదే అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. సందర్భం చేసుకుని మరీ…కేసీఆర్‌ను కలుస్తున్నారట. ఇవన్నీ చూసే గూడెం మళ్లీ కారెక్కుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి..

ఇక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి(bandla-krishnamohan-reddy) కాంగ్రెస్‌(congress) పార్టీలో చేరినప్పటికీ అక్కడ నియోజకవర్గ గొడవలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయంటున్నారు. గద్వాలలో ఓ మహిళా కాంగ్రెస్‌ నేతతో ఆయనకు క్షణం పడడంలేదని టాక్. దీంతో ఆయన విసుగుచెంది ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తాను పార్టీ మారినట్లు దుష్స్రచారం చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్‌ కూడా చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి… ఫిరాయింపుల కేసు విచారణ జరుగుతున్న క్రమంలో తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంశాన్ని తన జడ్జిమెంట్‌లో చెప్పారు. వాటికి తగినట్టుగానే బండ్ల కూడా అడుగులు వేస్తున్నారంటున్నారు. ఫిరాయింపు తలనొప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైప్, కేసీఆర్ రీఎంట్రీ ఇవన్నీ ఆలోచించే బండ్ల తిరిగి బీఆర్ఎస్‌లోకి వస్తారంటూ బల్లగుద్ది చెప్తున్నారు.

Also Read :  తగ్గిన క్రైమ్‌ రేటు..పెరిగిన నమ్మకద్రోహం..పోలీస్ వార్షిక నివేదికలో సంచలనాలు

సైదిరెడ్డి, అరూరి, గువ్వల..

ఇక బీఆర్‌ఎస్‌ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి ‘ఉన్నది కాస్త ఊడింది. సర్వమంగళం పాడింది’ అన్నట్టే తయారైందని చెబుతున్నారు. ఏదో చేద్దామని జంప్ కొడితే.. అది కాస్త రివర్స్ అయి తమ పేరు తామే చెప్పుకునే స్థితికి వచ్చిందంటున్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌(former-mla-aruri-ramesh), హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(saidi-reddy), అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju). ఈ ముగ్గురు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు. బీఆర్‌ఎస్‌ హయాం లో విప్‌గా గువ్వల బాలరాజు, హౌసింగ్‌ సొసైటీస్‌ చైర్మన్‌గా అరూరి రమేశ్‌, ఎమ్మెల్యే హోదాలో సైదిరెడ్డి వైభోగం అనుభవించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు.

బీఆర్‌ఎస్‌(brs) లో ఎమ్మెల్యేలుగా సాగించుకున్న హవా ఎంపీలై ఢిల్లీలో వెలుగుతామని భావించి అరూరి రమేశ్‌, శానంపూడి సైదిరెడ్డి బీజేపీ(bjp) లో చేరారు. వరంగల్‌ లోకసభ బీజేపీ అభ్యర్థిగా అరూరి, నల్లగొండ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరాభవం ఎదురైంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. అచ్చంపేటలో రెండు, వర్ధన్నపేటలో అరూరి రమేశ్‌ కష్టపడితే 4 సర్పంచ్‌ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి దుస్థితి. దీంతో పార్టీ మారి తప్పు చేశామనే అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారని.. త్వరలోనే గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు