chicken Price : చికెన్ ధరలు ఢమాల్.. కేజీ మరీ ఇంత చీప్ గానా!

నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..  శ్రావణ మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.   గత కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర రూ. 280-300 వరకు ఉండగా, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ధరలు దిగివచ్చాయి. 2025 జులై 27వ తేదీ ఆదివారం రోజున ధరలను ఒకసారి పరిశీలిస్తే

New Update
chicken

నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..  శ్రావణ మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.   గత కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర రూ. 280-300 వరకు ఉండగా, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ధరలు దిగివచ్చాయి. 2025 జులై 27వ తేదీ ఆదివారం రోజున ధరలను ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ లో  స్కిన్ తో కూడిన చికెన్ (Skin Chicken): కిలో సుమారు రూ. 190, స్కిన్ లెస్ చికెన్ (Skinless Chicken): కిలో సుమారు రూ. 220గా ఉంది.  లైవ్ చికెన్ (Live Chicken): కిలో సుమారు రూ.137గా ఉంది.  మటన్ ధరలు మాత్రం కిలో రూ. 800 నుంచి రూ. 900 వరకు ఉన్నాయి.  

తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి లేదా ఇంకా తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల స్కిన్ తో కూడిన చికెన్ రూ. 180, స్కిన్ లెస్ చికెన్ రూ. 200 వరకు కూడా ఉంది. ఈ శ్రావణ మాసం చివరి వరకు చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు, ఎందుకంటే చాలా మంది ఈ మాసంలో మాంసాహారం తినరు.  శ్రావణ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. 

మాంసాహారానికి దూరంగా

ఈ మాసంలో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పూజలు, వ్రతాలు చేస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనివల్ల చికెన్ వినియోగం బాగా తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాంసాహారం తినేవారి సంఖ్య తగ్గుతుంది కాబట్టి, చికెన్ కు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గడం సహజం. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి నిరంతరం జరుగుతూ ఉంటుంది. డిమాండ్ తగ్గినా, ఎదిగిన కోళ్లను నిర్ణీత సమయం తర్వాత ఫారాల్లో ఉంచడం లాభదాయకం కాదు. దాణా ఖర్చులు పెరుగుతాయి. అందుకే వ్యాపారులు కోళ్లను షాపులకు తరలించి, తక్కువ ధరలకే విక్రయిస్తారు. 

Also Read : Crime News : భార్య కోసం జాబ్ వదిలేసి దొంగగా మారిన భర్త.. పెళ్లైన నెలకే అరెస్ట్ !

Advertisment
తాజా కథనాలు