/rtv/media/media_files/2025/07/27/pre-ivf-diet-plan-2025-07-27-16-05-08.jpg)
Pre IVF Diet Plan
Pre IVF Diet Plan: పిల్లల నవ్వుతో గృహాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకునే ప్రతి దంపతులకి IVF ఒక ఆశగా మారింది. అయితే ఈ ప్రక్రియ భావోద్వేగ, మానసిక, శారీరక స్థాయిలలో చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. IVF ప్రయాణంలో విజయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆహారం. శరీరాన్ని లోపల్నించి సిద్ధం చేసుకోవడమే దీని మొదటి పని. సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల సమతుల్యతను, గర్భాశయ ఆరోగ్యాన్ని, అండాల నాణ్యతను, స్పెర్మ్ శక్తిని మెరుగుపరచడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. IVF ప్రారంభించేముందు మహిళలు, పురుషులు శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను పొందవచ్చు. ప్రీ IVF డైట్ ప్లాన్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆహారం ఎలా ఉండాలి..
ఈ దశలో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ప్రధానంగా ఉండే ఆహారం శరీరంలో టాక్సిన్లను బయటకు పంపి.. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. బెర్రీలు, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అండాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. పాలకూర, మెంతులు వంటి ఆకుకూరలు ఐరన్, ఫోలేట్ సమృద్ధిగా కలిగి ఉండి గర్భాశయ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ప్రోటీన్ శరీర నిర్మాణంలో కీలకమైన పోషకం. గుడ్లు, పప్పులు, జున్ను, గింజలు, చియా విత్తనాలు వంటి ప్రోటీన్ వనరులు హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి వనరుల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గించడంతోపాటు హార్మోన్ల నిర్మాణంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
IVFకు సిద్ధమవుతున్న మహిళలు రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీర వ్యవస్థలు సక్రమంగా పని చేయేలా చూడాలి. నీటి మట్టం సమతుల్యంలో ఉండడం శరీరపు శక్తి నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు అత్యంత అవసరమైన పోషకం. ఇది శిశువు ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవసరం. బ్రోకలీ, మొలకెత్తిన ధాన్యాలు, సప్లిమెంట్స్ ద్వారా దీనిని పొందవచ్చు. IVF ప్రయత్నంలో జంక్ ఫుడ్, అధిక కెఫిన్, ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లు అండాల, స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. వీటిని పూర్తిగా నివారించడం ద్వారా విజయం సాధించే అవకాశాలను పెంచుకోవచ్చు.అంతేకాక పురుషులూ ఇదే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించాలి. వారి స్పెర్మ్ నాణ్యత IVF ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారంతోపాటు వ్యాయామం, నిద్ర, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం IVF ప్రయాణాన్ని విజయవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ
( diet-plan | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)