/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
five members of same family found dead under suspicious circumstances in hyderabad
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. గురువారం ఉదయం స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఐదు మంది చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: ఇకనుంచి గవర్నర్ల ఇష్టారాజ్యం ఉండదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వాళ్లందరూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు భార్యభర్తలు అనిల్- కవిత, రెండేళ్ల చిన్నారి, అలాగే కవిత వాళ్ల అమ్మ నాన్న లక్ష్యయ్య-వెంకటమ్మగా గుర్తించారు. ముందుగా పాపను చంపిన తర్వాత వీళ్లు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. మృతులందరూ కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే వీళ్లు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Also Read: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ
ఇదిలాఉండగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి మరో దారుణం జరిగింది. భర్తతో వివాదం తలెత్తడంతో భార్య తన ఇద్దరు కొడుకులను నీటి సంపులో పడేసింది. ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఇది గమనించిన స్థానికులు వాళ్లని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కొడుకులు ఊపిరాడక చనిపోయారు. ఆమె మాత్రం ప్రమాదం నుంచి బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని ఓ వ్యక్తి అత్తమామలను అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెం గ్రామంలో చెందిన బాబురావు, శారద దంపతులు ఉంటున్నారు. వీళ్ల కూతురు నాగేశ్వరికి దెందులూరు మండలం గంగన్నగూడెంకి చెందిన రామకోటేశ్వర రావుతో 14 ఏళ్ళ క్రితం పెళ్లి చేశారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
Also Read: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి
అయితే గత కొంతకాలంగా నాగేశ్వరీ, రామకోటేశ్వర రావు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె ప్రస్తుతం తన పుట్టింట్లోనే ఉంటుంది. తాజాగా భర్త ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు అత్తింటికి వచ్చాడు. భార్యను కాపురానికి పంపాలని అడిగితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో రామకోటేశ్వరావు, అత్త మామల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అతడు వెంట తెచ్చుకున్న కత్తితో అత్తమామల పీక కోసి చంపేశాడు. ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది .