/rtv/media/media_files/2025/08/21/supreme-court-2025-08-21-07-02-32.jpg)
Supreme court
సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆయా రాష్ట్ర గవర్నర్ పంపే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో గవర్నర్లకు ఉండే అధికారాలు ఏంటో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపించాలనే నిర్ణయాన్ని ఒకవేళ గవర్నర్ ఎంచుకున్నట్లయితే.. ఆ బిల్లును నిలిపేసేందుకు, రాష్ట్రపతి పరిశీలనకు పంపేందుకు వీలు ఉండదని'' ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ
రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో గవర్లర్లు, రాష్ట్రపతికి గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపింది. గవర్నర్లు ఏదైనా బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపించకుండా.. ఎలాంటి కారణం లేకుండా తన వద్దే నిలిపి ఉంచుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువే లేకుండా పోయిందని ధర్మాసనం తెలిపింది. గవర్నర్ల ఇష్టారాజ్యానికి అణిగి ఉండాల్సి వస్తుందని పేర్కొంది.
Also Read: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి
గవర్నర్ బిల్లుల ఆమోదాన్ని నిలిపేస్తే ప్రజల ఓట్లతో ఎన్నుకున్న ప్రభుత్వాలు.. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చిన గవర్నర్లను వేడుకోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ బిల్లులపై ఎలాంటి విచక్షణాధికారాలు ఉపయోగించలేనప్పుడు గవర్నర్ వ్యవస్థ పోస్ట్‌మేన్ వ్యవస్థగా మిగిలిపోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రాజ్యాంగ సభలో గవర్నర్ల నియామకం, ఆయన నిర్వహించాల్సిన పాత్రలపై విస్తృత చర్చ జరిగిందని కోర్టుకు చెప్పారు. మొత్తానికి అసెంబ్లీలో రాష్ట్రప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆ రాష్ట్ర గవర్నర్ పంపే అవకాశం ఉండదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: సీఎం, పీఎం 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడే బిల్లు.. అమిత్ షా సంచలనం