Telangana: తెలంగాణ లో కొత్త వైరస్‌..25 ఏళ్ల మహిళ మృతి!

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా జీబీఎస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా జీబీఎస్ కొత్త కేసులు నమోదు కాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది.

New Update
gbs

gbs

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న వైరస్‌ పేరు గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌).ఇది ఒక నరాల వ్యాధి ఈ వ్యాధిని ముందుగా పూణేలో గుర్తించారు.తాజాగా ఇప్పుడు ఇదే వ్యాధితో తెలంగాణలో తొలి మరణం జరిగింది.ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సిద్దిపేటకు చెందిన ఓ వివాహిత (25) మృతి చెందారు. 

Also Read: Bangladesh:బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

కుటుంబ సభ్యులు ,వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వివాహిత (25)కు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో మహిళ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్‌లోని నిమ్స్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. 

Also Read: Donkey Route: డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

ఇదే తొలిసారని...

ఇలా ఆమె వైద్యానికి రూ.లక్షలు ఖర్చు పెట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్‌ కారణంగా పలువురు మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు.

శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితిని గులియన్‌ బారే సిండ్రోమ్‌ అంటారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా ఉంటుంది. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ప్రాథమిక దశలో కనపడతాయి. వీటితో పాటుగా పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, డయేరియా, కండరాలు బలహీనంగా మారడం వంటివి గులియన్‌ బారే సిండ్రోమ్‌ లక్షణాలుగా వివరిస్తారు. 

ఇది నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా రూపంలో సోకుతుంది. అయితే.. ఇది అంటువ్యాధి కాకపోవటం ఊరటనిచ్చే అశం. 

Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

Also Read: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు