/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T162812.320.jpg)
bangladesh
బంగ్లాదేశ్ లో యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు చేపడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించేవారిని ఏరి వేస్తామని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Donkey Route: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
1300 మంది అరెస్ట్
ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులు ప్రత్యేక భద్రతాలు యూనిట్లు కలిసి ఈ ఆపరేషన్ పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 1300 మందిని అరెస్ట్ చేశాయి.ఇటీవల షేక్ హసీనా కుటుంబ భవనాల పై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనం పై దాడికి పాల్పడ్డారు. దాంతో భవనం పూర్తిగా దెబ్బతిని..మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినతే మహ్మద్ యూనస్ కూడా విజ్ఙప్తి చేశారు.
Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
ఇటీవల ఓ మంత్రి పై దాడికి ఈ గ్యాంగ్ లే కారణమని సమాచారం.ఆపరేషన్ డెవిల్ హంట్ ను గాజీపూర్ లో మొదలు పెట్టిన దేశం మొత్తం అమలు చేస్తామని హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రజల భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా..భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు సైనికాధికారుల పై నేరారోపణలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే ఈ కొత్త ఆపరేషన్ కూడా హసీనా, అవామీ లీగ్ మద్దతుదారు పైనే అనే విమర్శలు వస్తున్నాయి.
వీటిని బంగ్లా హోంమంత్రి తోసిపుచ్చారు.డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులని అర్థం.దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు ,చట్టాన్ని ఉల్లంఘించే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది అని వెల్లడించారు.
Also Read: Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్!
Also Read: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!