Donkey Route: డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్‌ కి చెందిన 33 ఏళ్ల గుర్‌ప్రీతి సింగ్‌ డాంకీ రూట్‌ లో వెళ్తూ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

New Update
donkey rouate

donkey rouate Photograph: (donkey rouate)

అక్రమంగా తమ దేశానికి వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల అమెరికా తిప్పి పంపేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పంజాబీ యువకుడు డాంకీ రూట్‌ లో వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది. 33 ఏళ్ల గుర్‌ప్రీతి సింగ్‌ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

Also Read: Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.నా సోదరుడు గుర్‌ ప్రీత్‌ అమెరికా వెళ్తేందుకు మూడు నెలల కిందట ఇంటి నుంచి బయల్దేరారు. ఇందుకోసం చండీగఢ్‌లోని ఏజెంట్‌ బల్వీందర్‌సింగ్‌ను సంప్రదించాడు. అతడు రూ. 16. 5 లక్షలు తీసుకొని నా సోదరుడిని గయానా పంపించాడు. అక్కడ ఓ పాకిస్థానీ ఏజెంట్ కు అప్పగించాడు. అనంతరం మరికొందరు వలసదారులతో కలిసి పనామా అడవి గుండా కొలంబియాకు బయల్దేరాడు. మధ్యలో ఓసారి మాకు ఫోన్‌ చేసి గ్వాటమాలాలోని హోటల్‌ లో ఉన్నట్లు చెప్పారు. 

Also Read: Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్‌!

ఆ తర్వాత ఇటీవల ఓ వ్యక్తి మాకు ఫోన్‌ చేసి గుర్‌ ప్రీత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపాడు. కారులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. ఆ తరువాత ఐదారు నిమిషాలకే నా సోదరుడు చనిపోయినట్లు సమాచారమిచ్చారు అంటూ గుర్‌ ప్రీత్‌ సోదరుడు తారాసింగ్‌ మీడియాకు వివరిస్తూ కన్నీరుమున్నీరయ్యారు.

అక్రమమార్గంలో వెళ్లొద్దు..

తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మృతుడి కుటుంబాన్ని పంజాబ్‌ రాష్ట్ర మంత్రి కుల్దీప్‌ సింగ్‌ దలివాల్ పరామర్శించారు. గుర్‌ ప్రీత్‌ మరణం విచారకరం. ఎవరనా సరే ఏ దేశానికైనా అక్రమమార్గంలో వెళ్లొద్దు. చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకుని వెళ్లండి. డాంకీరూట్‌ లో వెళ్లడం సరికాదు అని మంత్రి సూచించారు.

అక్రమ వలసదారుల పై ట్రంప్‌ మొదటినుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.

Also Read:Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

Also Read: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment