/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t085151599-2025-11-08-08-53-30.jpg)
Fatal accident in Nalgonda district
Nalgonda Accident: నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం(road accident) చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఆక్షణమే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.
Also Read: హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
Fatal Accident In Nalgonda District
అయితే ప్రమాద సమయంలో ఇన్నోవాలో 8 మంది ఉండగా వారంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు కారు అడ్డంగా పడిపోవడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాన్ని పక్కకు తీసి.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అంతరిక్షంలో అద్భుతం.. స్పేస్ స్టేషన్‌లో వంట చేసిన వ్యోమగాములు
Follow Us