BIG BREAKING : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మైనంపల్లి ఎంట్రీతో కీలక నేత  రాజీనామా!

కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు.

New Update
mynampally

తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి కొద్దీసేపటి క్రితమే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమెదించాలని ఆ లేఖలో కోరారు. సిద్దిపేటకు ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా చక్రధర్ గౌడ్ వెల్లడించారు.

బీజేపీలో చేరే అవకాశం

తనతో తిరిగే కాంగ్రెస్  కార్యకర్తలపై కేసులు పెట్టడం తనను బాధించిందని తెలిపారు.మైనంపల్లి త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా చక్రధర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లభించలేదని భావించి, పార్టీని వీడుతున్నట్లు గౌడ్ స్పష్టం చేశారు. ఇంతకాలం తనను ఆదరించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సిద్ధిపేట కాంగ్రెస్ కార్యకర్తలకు చక్రధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆయన  ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Advertisment
తాజా కథనాలు