/rtv/media/media_files/2025/08/10/hyderabad-as-the-capital-of-india-2025-08-10-18-11-40.jpg)
Hyderabad as the capital of India.
Grok :హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాలతో పోటీపడగల స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని కావడానికి అవసరమైన అన్ని రకాల వసతులు హైదరాబాద్ సొంతం. అనేక సంవత్సరాలుగా హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న చర్చ సాగుతోంది. అయితే భారతదేశానికి ఢిల్లీ కాకుండా హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతున్నదే. అయితే ఈ సారి ఈ అభిప్రాయాన్ని పంచుకున్నది మాత్రం మనిషి కాదు.. ఏఐ దిగ్గజ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok chatbot). గతంలో కంటే భిన్నంగా ఎక్కువ మంది హైదరాబాద్ దేశ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.
Which city would you prefer to be the capital of India if not New Delhi?
— Indian Tech & Infra (@IndianTechGuide) August 10, 2025
అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో అన్ని ప్రధాన నగరాలకంటే భారత్‌కి బెస్ట్ రాజధాని హైదరాబాదే అని గ్రోక్ కితాబు ఇచ్చింది. ఎక్స్ వేదికగా @IndianTechGuide అనే యూజర్ రాజధాని గురించి టాపిక్ పోస్ట్ చేశారు. భారతదేశ రాజధానిగా మీరు న్యూఢిల్లీ కాకపోతే ఏ నగరాన్ని ఇష్టపడతారు? అని ఆ యూజర్ ట్వీట్ చేశారు. దీనికి చాలా మంది నెటిజన్లు తమకు ఇష్టమైన నగరాల పేర్లు సూచించారు. అందులో హైదరాబాద్ తో పాటు , పుణే, నాగ్‌పూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఇండోర్, చెన్నై అంటూ ఇలా పలు ప్రముఖ నగరాల పేర్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే వారికి భిన్నంగా ఓ నెటిజన్ గ్రోక్ ను ఇదే విషయమై ప్రశ్నించాడు. గ్రోక్ సైతం హైదరాబాద్ నగరం వైపే మొగ్గుచూపింది. నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు టెక్ ఎకో సిస్టమ్ ఉందని.. ఢిల్లీ కన్నా హైదరాబాద్ వాతావరణం ఎంతో మెరుగైనదని గ్రోక్ ఆన్సర్ చేసింది.
Also Read : Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్ లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్
కాగా, ఈ సమాధానంతో నెటిజన్లు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎక్కువమంది నెటిజన్లు మాత్రం హైదరాబాద్ దేశ రాజధానిగా ఉండడాన్ని సమర్ధించారు. అందులో ఓ వ్యక్తి చేసిన కామెంట్ మరింత హైలెట్‌గా నిలిచింది. ‘హైదరాబాద్ సౌత్ లోకేషన్ లో ఉంది. కాబట్టి సౌత్ అండ్ నార్త్ ఇండియా అనే వాదన అవసరం లేదు. పొరుగు దేశాలకు చాలా దూరంలో ఉంది. మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ హిందీ సులభంగా అర్థమవుతుంది. భాషాపై యుద్ధం లేదు. సులభంగా మైగ్రేషన్ అవ్వొచ్చు. ఎన్నో స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. టెక్ సిటీ, రామోజీ ఫిల్మ్‌సిటీ. టాలీవుడ్ ఉన్నాయి’ అని స్వప్న కుమార్ పండా (@swapnakpanda) అనే యూజర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం.