Actor Sunil : పాకిస్థాన్ లో కమెడియన్ సునీల్ కు ఫ్యాన్స్....వారితో కలిసి సునీల్ ఏం చేశాడంటే...

‘నేనొక లోకల్ ప్రొడక్ట్..పుష్పతో ముద్రవేసి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు. పాకిస్థానీయులు కూడా నన్నుఅభిమానిస్తున్నారు.ఇందుకు స్పెయిన్ లో నాకు ఎదురైన అనుభవమే ఉదాహరణ’ అన్నారు టాలీవుడ్‌ నటుడు సునీల్. పుష్ప-2 థ్యాంక్స్ మీట్ లోతన అనుభవాలను పంచుకున్నారు.

New Update
 Actor Sunil

Actor Sunil

‘నేనొక లోకల్ ప్రొడక్ట్.. పుష్పతో ముద్ర వేసి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు. పాకిస్థానీయులు (Pakistani's) కూడా నన్ను అభిమానిస్తున్నారు. ఇందుకు స్పెయిన్ లో నాకు ఎదురైన అనుభవమే ఉదాహరణ’ని అన్నారు టాలీవుడ్‌ కమెడియన్‌ సునీల్. పుష్ప-2 థ్యాంక్స్ సమావేశంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

Also Read :  సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

Fans Of Sunil In Pakistan 

‘ఇటీవల ఓ షూటింగ్ కోసం స్పెయిన్ (Spain) వెళ్లా. అక్కడ రాత్రి 10కే రెస్టారెంట్లు మూసేస్తారు. 9.45 సమయంలో ఓ స్టోర్లో స్నాక్స్ అడిగితే క్లోజ్ అన్నారు.సరేలే సర్దుకుపోదామనుకున్నా. ఆ తర్వాత దగ్గర్లో రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్‌ చేశాం. రెస్టారెంట్స్ కోసం వెతికితే కబాబ్ పాయింట్ కనిపించింది. ఇండియన్ ఫుడ్ అనుకున్నాం. అక్కడికి వెళ్లాం. అప్పుడు సమయం 2.30 అవుతుంది. మేము కారు దిగగానే అప్పుడు నన్నో వ్యక్తి తదేకంగా చూస్తూ దగ్గరకొచ్చాడు’. ‘తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరేనా అనడిగాడు. అప్పుడు తెలిసింది అది పాకిస్థానీయులదని. నాతోపాటు డైరక్షన్ డిపార్ట్ మెంట్లో అందరికీ ఫుడ్ వండిపెట్టారు. అతని ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడా. పుష్ప ఎందరికో రీచ్ అయిందనేందుకు ఇదే ఉదాహరణ. పుష్ప వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని గతంలో నేను చెప్పిన మాటే నిజమైంద’ని అన్నారు.

ఇది కూడా చదవండి: AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!

పుష్ప (Pushpa) సినిమా ఎంతోమందికి చేరింది. నేను ఎక్కడికి వెళ్లినా నన్ను చూసి గుర్తు పడుతున్నారు. తద్వారా పుష్పను గుర్తు చేసుకుంటున్నారు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు హైదరాబాద్‌ వచ్చా ఎలాగైన సినిమా విలన్ కావాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఫోటోలు దిగి ఎంతోమందని కలిశా. కానీ ఎవరూ తీసుకోలేదు. ఆ తర్వాత కమెడియన్‌గా గుర్తింపు వచ్చింది. అయితే ఒక కమెడియన్‌ను విలన్‌గా తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు ఇది పునర్జన్మ. మొదటి రోజు షూటింగ్‌లో నాకు ఎంతో కంగారుగా అనిపించింది. భాష విషయంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) నాకెంతో సాయం చేశారు. మీరు కష్టాన్ని నమ్ముకున్నారు. మీ కష్టానికి ఆ దేవుడు ఎప్పుడూ న్యాయం చేయాలని కోరకుంటున్నా అని సునీల్‌ అన్నారు.

Also Read :  వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!

Also Read :  టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు