High Court: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడంపై ఉన్న ఆంక్షలు తప్పనిసరి కాదని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Women can be arrested even after sunset

Women can be arrested even after sunset

మద్రాస్ హైకోర్టు (Madras High Court) సంచలన తీర్పునిచ్చింది. సూర్యాస్తమయం (Sunset) తర్వాత సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్టు చేయడంపై ఉన్న ఆంక్షలు తప్పనిసరి కాదని పేర్కొంది. ఈ నిబంధన చట్టంలోని ఒక హెచ్చరిక చర్యగా ఉన్నప్పటికీ.. దీన్ని పాటించకుండా అరెస్టు చేయడం చట్ట విరుద్ధం కాదని స్పష్టం ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ నిబంధనను పాటించకుండా అరెస్టు చేయడంపై సంబంధిత అధికారి కచ్చితంగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.  

Also Read: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

Also Read :  వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!

Madras High Court Rule

వాస్తవానికి అసాధారణ పరిస్థితుల్లో తప్ప రాత్రి సమయంలో మహిళలను అరెస్టు చేయడం సీఆర్‌పీసీ సెక్షన్ 46(4) ప్రకారం నిషేధం. ఇలాంటి సందర్భాల్లో మెజిస్ట్రేట్‌ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అసాధరణ పరిస్థితికి సరైన నిర్వచనం లేదని కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే  సల్మా వర్సెస్ స్టేట్‌ కేసును కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. మహిళలను అరెస్టు చేయడానికి సంబంధించి సింగిల్‌ జడ్జి గతంలో గైడ్‌లైన్స్‌ను రూపొందించారని పేర్కొంది. అయినప్పటికీ చట్టాన్ని అమలు చేసే అధికారులకు దీనిపై స్పష్టత ఇవ్వడంలో తగినంత మార్గదర్శకాలు లేవని ధర్మాసనం గుర్తించింది. 

Also Read: ఢిల్లీ బీజేపీ మాజీ సీఎంలు వీళ్లే..  ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు!

రాత్రి సమయంలో మహిళను అరెస్టు చేసేందుకు ఆ అసాధారణ పరిస్థితి ఏంటో స్పష్టత ఇచ్చేలా మరిన్ని గైడ్‌లైన్స్‌ను రూపొందించాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. అలాగే భారతీయ న్యాయ సన్హితలోని సెక్షన్ 43 సవరణను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాలని సూచించింది. సూర్యాస్తమయం తర్వాత ఓ మహిళను అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్ అనిత, హెడ్‌ కానిస్టేబల్ అనితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సింగిల్‌ జడ్జి ఆదేశాన్ని హైకోర్టు పక్కన పెట్టింది. అయినప్పటికీ కోర్టు ముందు సరైన వాస్తవాలను ప్రవేశపెట్టనందుకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దీపాపై చర్యలు తీసుకోవడాన్ని న్యాయస్థానం సమర్ధించింది. 

Also Read :  స్టైలిష్ మౌని.. అబ్బో జీన్స్ లో ఈ బ్యూటీ ఫోజులు చూస్తే మీ పని అంతే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు