K. T. Rama Rao : కేటీఆర్‌ చొరవతో మలేసియా జైలు నుంచి ఇంటికి...కన్నీటి పర్యంతమైన కుటుంబాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్‌ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

New Update
Released from Malaysian prison on KTR's initiative

Released from Malaysian prison on KTR's initiative

K. T. Rama Rao : మలేషియాలో జైలు శిక్ష అనుభవించి ఆదిలాబాద్ జిల్లా కదం మండలంలోని లింగాపూర్ మరియు దస్తురాబాద్ మండలంలోని మున్యాల్‌కు చెందిన తెలంగాణకు చెందిన ఆరుగురు వ్యక్తులు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ నేత భూక్యా జాన్సన్‌ నాయక్‌తో కలిసి నందినగర్‌ లోని కేటీఆర్‌ నివాసంలో  ఆయనను బాధితులు, వారి కుటుంబ సభ్యులు కలిశారు.  ఈ సందర్భంగా తాము అనుభవించిన శిక్షను తలచుకొని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని కేటీఆర్‌ ఓదార్చారు. వారందరికీ పార్టీ, తాము అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్‌ మండలం మూన్యాల్‌కు చెందిన ఆరుగురు ఉపాధి కోసం గత సంవత్సరం మలేసియాకు వెళ్లారు.  వారిలో రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, యమునూరి రవీందర్  ఉన్నారు. మలేషియా వెళ్లిన వీరికి స్థానిక చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వారిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్, ఖానాపూర్ BRS ఇన్‌ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్‌తో మాట్లాడి వారి విడుదలకు మార్గాలను తెలుసుకోవాలని పురామాయించారు. జాన్సన్‌ జైలులో ఉన్న వ్యక్తులతో సమావేశమై, వారి విడుదలకు దారితీసే చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని న్యాయ సలహాదారుడిని నియమించారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

మార్చిలో మలేషియా వెళ్లిన జాన్సన్‌ జైలులో ఉన్న వారంతా అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో  సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించారు. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మలేసియాకు మళ్లీ వెళ్లి.. అక్కడి కోర్టు విధించిన జరిమానా చెల్లించి, వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. దీనివెనుక బీఆర్‌ఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కృషి ఉండటంతో వారంతా కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని, తాము సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృషి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భారత రాయబార కార్యాలయం తమకు పెద్దగా సహాయం చేయలేదని, చట్టపరమైన సహాయం అందించడం ద్వారా తమ పౌరులను తక్కువ సమయంలోనే విడుదల చేయించుకోవడానికి చైనా ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో మనవాళ్లు అలా చేస్తే నెలల తరబడి జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉండదని బాధితులు అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు