/rtv/media/media_files/2025/05/21/AidpfKVYiNZcac29QPVT.jpg)
హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వెళ్తే ఎలా ఉంటుందో అందరం చూసి ఉంటాం. అంతకు మంచి పదిరేట్ల యాక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అవును ఇలాంటిది గుజరాత్ లో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 బుల్డోజర్లు దండయాత్రకు బయలుదేరాయి. ఆక్రమణలను నిమిషాల వ్యవధిలోనే చూస్తుండగానే కూల్చివేశాయి.అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు మంగళవారం నాడు దానిలిమ్డాలోని చందోలా సరస్సును అక్రమంచ కట్టిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు.
On May 20, in Chandola Lake, Ahmedabad, Gujarat, the Municipal Corporation has launched the second phase of a demolition drive aimed at razing 7,000 Muslim households. The police described the operation as “action against illegal Bangladeshi immigrants,” with Police Commissioner pic.twitter.com/BMPc8ogXgu
— Mohd Shahnawaz Hussain (@Mohd_S_Hussain) May 20, 2025
8 వేల 500 ఇళ్లు కూల్చివేత
ఒక్కరోజే ఏకంగా 8 వేల 500 ఇళ్లను కూల్చివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింంది. దీని ద్వారా అధికారులు మొత్తం 2 లక్షల 50 వేల చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 350 మంది సిబ్బంది పాల్గొని మంగళవారం ఉదయం 7 గంటలకు పని ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు 35 బుల్డోజర్లు, 15 మట్టిని తొలగించే యంత్రాలను మోహరించారు. కూల్చివేత సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి 3,000 మందికి పైగా పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీసు (SRP) సిబ్బందిని మోహరించారు.
Ahmedabad, Gujarat: The demolition drive to remove illegal encroachments in the Chandola Lake area continued for the second day. While unauthorized settlements were cleared yesterday, action is still underway against some remaining religious encroachments pic.twitter.com/Y7Rp7FIoxq
— IANS (@ians_india) May 21, 2025
చందోలా సరస్సు వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం మున్సిపల్ కార్పొరేషన్ , నగర పోలీసులు ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించారు, మొదటి దశలో కూల్చివేత జరిగింది. మొదటి రోజు ఫామ్‌హౌస్‌లు, గిడ్డంగులు , తాత్కాలిక నివాసాలతో సహా 1 లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని తొలగించారు. రెండవ రోజు 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు జరిగింది. చివరి రోజు ఘోడాసర్ సమీపంలోని 25 దుకాణాలు, సరస్సులోని వివిధ కట్టల పక్కన 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద గిడ్డంగితో సహా వాణిజ్య సంస్థలపై దృష్టి సారించింది. దాదాపు 99.9 శాతం ఆక్రమణలను కూల్చివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2010 కి ముందు నుంచి ఇక్కడ నివసిస్తున్న వారికి వసతి కల్పిస్తామని.. ఆ తర్వాత వచ్చిన వారు వెళ్లిపోవాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.