శవాలు కొనే కశ్మీర్‌ ముస్లీం.. అయోధ్య రామమందిరంలో నమాజ్

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబూ అహ్మద్ షేక్ శనివారం ఉదయం గేట్ D1 ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సాంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో ఉన్న అతడు, ఆలయ దక్షిణ భాగంలోని 'సీతా రసోయి' సమీపంలో కూర్చుని నమాజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

New Update
ayodhya

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబూ అహ్మద్ షేక్ (సుమారు 50 ఏళ్లు) శనివారం ఉదయం గేట్ D1 ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సాంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో ఉన్న అతడు, ఆలయ దక్షిణ భాగంలోని 'సీతా రసోయి' సమీపంలో కూర్చుని నమాజ్ చేయడానికి రెడీ అయ్యాడు. దీనిని గమనించిన సశస్త్ర సీమా బల్, ఇతర భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా సిబ్బంది అతడిని ఆపే ప్రయత్నం చేయగా, అబూ అహ్మద్ షేక్ బిగ్గరగా మతపరమైన నినాదాలు (నరా-యే-తక్బీర్) చేసినట్లు సమాచారం. దీంతో ఆలయ ప్రాంగణంలోని భక్తుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని సీక్రెట్ ప్లేస్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఐబీ, లోకల్ ఇన్విస్టిగేషన్ సంస్థలు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తులో కీలకాంశాలు

ప్రాథమిక విచారణలో నిందితుడు తాను శాలువాలు విక్రయిస్తానని, అయోధ్యను సందర్శించడానికి వచ్చానని తెలిపినట్లు సమాచారం. అయితే, అతడు అంత పటిష్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి ఎలా ప్రవేశించాడు? నమాజ్ చేయడానికి ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ఫోన్ డేటా అధికారులు చెక్ చేస్తున్నారు. రామమందిరం వద్ద ఎప్పుడూ అత్యంత కఠినమైన తనిఖీలు ఉంటాయి. అయినప్పటికీ ఈ ఘటన జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఆలయ కాంప్లెక్స్ వద్ద 'స్క్రీనింగ్' ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. భక్తుల ముసుగులో ఎవరూ అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడకుండా ఆలయం లోపల, వెలుపల అదనపు బలగాలను మోహరించారు.

Advertisment
తాజా కథనాలు