USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల నిషేధం..భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

విద్యార్ధుల గురించి సమాచారం ఇవ్వలేదని హార్వర్డ్ మీద కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం. దాని కోసం తాజాగా విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించింది. దీని కారణంగా మొత్తం 800 మంది భారతీయ విద్యార్థులు పాట్లు పడక తప్పదని తెలుస్తోంది. 

New Update
Trump and harvard university

Trump and harvard university

హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రోగ్రామ్ ను నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం కొత్త రూల్ ను పెట్టింది దీని కారణంగా దాదాపు 140 దేశాలకు చెందిన విద్యార్థులు ఎఫెక్ట్ అవ్వనున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపు 800 మంది ఇండియన్ స్టూడెంట్స్ హార్వర్డ్ లో చదువుతున్నారు. ఇప్పుడు వీరందరికీ కష్టాలు తప్పవని తెలుస్తోంది. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొత్త రూల్ ను వెంటనే అమలు చేస్తామని చెబుతోంది. దీంతో కొత్తగా వ్చే వారి మాట ఏమో కానీ ఆల్రెడీ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి?

ప్రస్తుతం హార్వర్డ్ లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 800. వీరందరూ వెంటనే SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ కావాల్సి ఉంటుంది. వీలైనంత తొందరగా స్టూడెంట్స్ ఈ పనిని చేయాలి. లేకపోతే వారి వీసా రద్దు చేయబడుతుంది. దాంతో పాటూ అమెరికా నుంచి బహిష్కరణకు కూడా గురికావచ్చును. ఇంత వరకు బాగానే ఉన్నా...ఈ వెసులుబాటు అందరికీ ఉపయోగపడదనే భయం కూడా ఉంది. హార్వర్డ్ లో చాలా మంది భారతీయ విద్యార్థులు దీర్ఘకాలిక డాక్టోరల్ లేదా ఎక్కువ సంవత్సరాల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరారు.ఈ కోర్సు మధ్యలో  SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ కావడం అంత ఈజీ కాదు. పైగా దీని వలన విద్యాపరంగా అంతరాయం కలిగవచ్చును. పోనీ ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఏమైనా వెతుకుదామా అంటే దానికి కూడా పెద్దగా సమయం లేదని చెబుతున్నారు. వెంటనే బదిలీ కావాలి లేదా కోర్సు మధ్యలోనే వదిలి దేశం నుంచి వెళ్ళిపోవాలని చెబుతున్నారు. యూనివర్శిటీకి, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న గడవ వలన విద్యార్థల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వందల మంది స్టూడెంట్స్ చదువు అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 today-latest-news-in-telugu | usa | trump | harvard university  harvard university

Also Read: Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ రాజీనామా? వ్యాపిస్తున్న వార్తలు

Advertisment
తాజా కథనాలు