స్థానిక సమారానికి సై...మూడునెలల్లో కొత్త పాలకమండళ్లు
గతేడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.