/rtv/media/media_files/2025/03/13/QuaWMTsMcsk5afSZdDNs.jpg)
elderly man beaten to death by young man in Old City hyderabad
దుండగుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా దాడులకు తెగబడుతున్నారు. ఎదిరించిన వారిని కొట్టి కొట్టి చంపుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. 62 ఏళ్ల ఓ వృద్ధుడు తన షాప్ వద్ద కూర్చోవద్దని చెప్పినందుకు కొందరు యువకులు అతడిపై దాడి చేశారు. చేతితో ముఖం, ఛాతిపై గడ్డిగా గుద్దారు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
కూర్చిలోంచి లేవండి
కాంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని బాబా నగర్‌లో జాకీర్ ఖాన్ (62) కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆ పక్కనే పాన్ షాప్ ఒకటి ఉంది. దీంతో కొందరు యువకులు నిన్న (బుధవారం) రాత్రి ఆ షాప్ ముందు కుర్చీలు వేసి కూర్చున్నారు. వెంటనే జాకీర్ ఖాన్ బయటకు వచ్చి.. తన షాపు ముందు కుర్చీలు తీయాలని వారిని అడిగాడు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
దీంతో కొందరు అక్కడ నుంచి పైకి లేచి సైడ్‌కి వచ్చేశారు. కానీ ఇంకొందరు అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో జాకీర్ ఎంత చెప్పినా వారు లేవలేదు. పైగా ఆయనతోనే వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. మొదటిగా అతడి చెంపపై గట్టిగా కొట్టాడు. అనంతరం అదే యువకుడు జాకీర్ ముఖం, ఛాతిపై బలంగా గుద్దాడు.
సీసీటీవీ ఫుటేజ్
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025
ఓల్డ్ సిటీలో షాపు ముందు కూర్చోవద్దని అన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపిన యువకులు
కాంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని బాబా నగర్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న జాకీర్ ఖాన్(62) షాపు ముందు నిన్న రాత్రి కుర్చీలు వేసి కస్టమర్లను కూర్చోబెట్టిన పక్కన ఉన్న పాన్ షాప్ యజమానులు
తన… pic.twitter.com/QmygBxlOTS
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
దీంతో కింద పడిపోయిన ఆ వృద్ధుడిని కొందరు హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా జాకీర్‌కు అప్పటికే ఓపెన్-హార్ట్ సర్జరీ జరగడంతో ఈ దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఈ సమాచారాన్ని కాంచన్‌బాగ్ పోలీసులకు అందించగా.. వారు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?