NEW YEAR 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..!

న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్‌చల్ చేశారు.

New Update
new year Drunken drive test

new year Drunken drive test

న్యూ ఇయర్ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మద్యం ప్రియులు చుక్క ముక్కతో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. పార్టీలు, పబ్బులంటూ పీకలమొయ్య తాగి తూలారు. అదే తరుణంలో నూతన సంవత్సరం వేళ ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. 

Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

రోడ్లపై హాల్ చల్

రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎంతో మంది మద్యం ప్రియులు పట్టుబడ్డారు. రోడ్లపై వాహనాలత విన్యాసాలు చేస్తూ యువకులు హాల్ చల్ చేశారు. అదే సమయంలో పట్టుబడ్డ మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

రోడ్లపై రచ్చ రచ్చ చేసిన మందు బాబులను పోలీసులు పట్టుకోగా.. వారు మారం చేశారు. వదులుతారా? లేదా? అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయించడానికి పోలీసులు ప్రయత్నించగా.. మందుబాబులు రచ్చ రచ్చ చేశారు. ఎంత చెప్పినా వినలేదు. ముగ్గురు నలుగు పోలీసులు కలిసి వారితో టెస్ట్ చేయించారు. 

Also Read: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

అలాగే ఇంకొందరు కూడా పోలీసులకు అస్సలు సహకరించలేదు. వెహికల్స్ ఆపి చెక్ చేయగా.. పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని ఎలా ఆపుతారు అంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఇంకొందరు మాత్రం న్యూ ఇయర్ ఒక్కరోజే తాగుతున్నాం సర్ అంటూ పోలీసులతో రిక్వెస్ట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు