Woman suicide : తాగుబోతు భార్య.. తాగొద్దన్న భర్త..ఎలుకల మందుతాగి..

రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కిస్మత్ పుర ప్రాంతంలో శేఖర్, అరుణ దంపతులు ఉంటున్నారు. అయితే.. అరుణకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. మద్యానికి భానిసైన భార్యను మద్యం తాగొద్దు అని వారించినందుకు ఆమె ఎరుకల మందు తాగి సూసైడ్ చేసుకుంది.

New Update
sucide

Woman suicide : ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధాలు ఎవరికీ వారే యమునకు నీరే అన్న చందంగా తయారయ్యాయి. దీంతో ఒకరు చెబితే మరోకరు పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయారు. పెళ్లి చేసుకున్నాక ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండాల్సిందిపోయి ఒకరిపై ఒకరు షాడిజం ప్రదర్శించడంలో పోటీ పడుతున్నారు.భార్యభర్తల మధ్య ఉన్న చెడు అలవాట్లు కూడా కాపురంలో కల్లోలాలు రేపుతున్నాయి. సాధారణంగా మన సమాజంలో మగవాళ్లే ఎక్కువగా మద్యం సేవిస్తుంటారు. దీంతో కుటుంబంలో కలతలు రావడం సహజం. నిత్యం తాగి వచ్చే భర్తతో భార్య గొడవ పడటం మనం చూస్తుంటాం కానీ, హైదరాబాద్‌లో దీనికి భిన్నమైన ఘటన చోటు చేసుకుంది. మద్యానికి భానిసైన భార్యను మద్యం తాగొద్దు అని వారించినందుకు ఆమె ఏకంగా ఎరుకల మందు తాగింది.

Also Read: Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!

రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కిస్మత్ పుర ప్రాంతంలో శేఖర్, అరుణ దంపతులు ఉంటున్నారు. అయితే.. అరుణకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. ఈ విషయం పెళ్లి తర్వాత తెలియడంతో పరువు పోతుందని శేఖర్‌ భరించుకుంటూ వస్తున్నాడు. మద్యం సేవించవద్దని భార్యకు ఎన్నిసార్లు చెప్పిన ఆమె  తన తాగుడు మాత్రం తగ్గించుకోలేదు. తన సంపాదనంతా తాగుడుకు పెడుతుందని భర్త శేఖర్ ఇంట్లో వాపోయేవాడు. అయితే భార్యను తరచూ మద్యం తాగడాన్ని నిరోధించేవాడు. ఆ క్రమంలో బుధవారం మద్యం సేవిస్తున్న అరుణను శేఖర్ వారించాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

Also Read:'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్​లో చుక్కలు చూపించిన భర్త..!

 దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య భర్త శేఖర్‌ పనికి వెళ్లగానే ఇంట్లో ఎవరు లేనిది చూసి మద్యంలో ఎలుకల మందు కలుపుకుని తాగింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆమె పడిపోయి ఉంది. వారు వెంటనే అరుణను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ మరణించింది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా అరుణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

Advertisment
తాజా కథనాలు