Rajendranagar: దివ్యాంగుడు పుట్టాడని భార్యను వదిలేసిన భర్త
రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్య(అలేఖ్య) ఒక దివ్యాంగుడికి జన్మనిచ్చిందనే కారణంతో భర్త (ఉదయ్) ఆమెను వదిలేశాడు. పిల్లవాడిని బయటే వదిలేసి రావాలని కఠినంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళన చెందిన అలేఖ్య.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది.