Period Leave Policy: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. నెలలో ఒకరోజు మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవు ఇవ్వనున్నారు.

New Update
Period Leave Policy Approved For Female Employees in Karnataka

Period Leave Policy Approved For Female Employees in Karnataka

కర్ణాటక ప్రభుత్వం(karnataka government) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. నెలలో ఒకరోజు మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవు(Period Leave Policy) ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగినులతో సహా వస్త్ర పరిశ్రమ, ఐటీ, బహుళజాతి సంస్థలు, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో కూడా పనిచేసే వాళ్లకు ఈ సెలవు వర్తించనుందని కర్ణాటక సర్కార్‌ పేర్కొంది. 

Also Read: 'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్

Period Leave Policy Approved For Female Employees In Karnataka

కేబినెట్ మీటింగ్ తర్వాత న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ దీనిగురించి మాట్లాడారు.  '' మహిళా ఉద్యోగినుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం(menstrual-cycle) ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. మేము తీసుకున్న ఈ నిర్ణయం మహిళా ఉద్యోగినులకు ఎంతగానో సాయపడనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడ కూడా ఈ సెలవు ఇవ్వాలని అనుకుంటున్నామని'' పేర్కొన్నారు. 

Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇలాంటి నిర్ణయాల ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే బీహార్, కేరళ, సిక్కి, ఒడిశా రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అంతేకాదు జొమాటో, ఎల్ అండ్ టీ, స్విగ్గీ, గోజూప్‌ లాంటి సంస్థలు కూడా వేతనంతో కూడిన నెలసరి సెలవులు ఇస్తున్నాయి. 

Also Read: అమ్మతోడు.. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. తేజస్వి యాదవ్ సంచలన హామీ

Advertisment
తాజా కథనాలు