/rtv/media/media_files/2025/10/09/crime-2025-10-09-19-02-29.jpg)
Man Kills Wife, Hides Body Under Bed, Flees, Family Claims Dowry Harassment
కర్ణాటక(karnataka) లోని బెలగావిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆకాష్ కంబర్ అనే వ్యక్తికి నాలుగు నెలల క్రితం సాక్షి(20) అనే యువతితో వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో మూడు రోజుల క్రితం ఆకాష్ భార్యను హత్య(husband-killed-wife) చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు.
Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
Husband Killed Wife
ఆకాష్‌కు అతడి తల్లి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో ఆందోళనతో ఆమె ఇంటికి వచ్చాక మంచం కింద కోడలు మృతదేహాన్ని చూసి షాకైపోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాక్షి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆకాశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వరకట్న వేధింపుల వల్లే సాక్షిని ఆకాశ్ హత్య చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also read: 'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్
ఇదిలాఉండగా హర్యానాలోని గురుగ్రామ్‌లో మరో దారుణం జరిగింది. ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీకి పనిచేస్తున్న 28 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుభమ్ మీనా అనే వ్యక్తికి 6 నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఓ మహిళతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులిద్దరూ నయాగావ్ ప్రాంతంలోని మాతా కాలనీ సమీపంలో ఉంటున్నారు. రాజస్థాన్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం శుభమ్ ఇంటినుండి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. చివరికి ఇంటిపైన మరో రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. అయితే అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది.