/rtv/media/media_files/2025/04/20/EYGO0XEkVXSsT3uiWptx.jpg)
Plastic Rice
TG Plastic Rice: తెలంగాణ ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సన్నబియ్యం పంపిణీపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యాన్ని సరఫరా చేస్తోందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ తున్నాయి. ఈ వీడియో చూసిన పలువురు లబ్ధిదారలు రేషన్ షాపు నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని పరీక్షించే పనిలో పడ్డారు. మరికొంత మంది వాటిని తినాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
ముఖ్యంగా రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో పేదలకు సన్న బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారంటూ ఎక్స్‌లో Devi Sharma అనే అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ అయింది. "సన్న బియ్యం అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్స్ లో జరా పైలం. గాలిమోటర్ల పోయి నీళ్లు వాటర్ మంత్రి ప్లాస్టిక్ బియ్యం పంపిణి చేసినవి, మిస్టర్ ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు మంత్రి మీ సమాధానం ఏంటి?" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ప్రతిపక్ష పార్టీలు దీన్ని మరింత వైరల్ చేయడానికి వారి సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం బదులు ప్లాస్టిక్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తోంది అని వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చింది.
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
అయితే రాష్ట్రంలో సన్న బియ్యం పేరుతో ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ సివిల్ సప్లై అధికారులు స్పందించిన వార్తను పలు వెబ్‌సైట్లు ప్రచురించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ వార్తల ప్రచారంపై కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపింది.పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని తిలక్ నగర్‌లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఫేస్‌బుక్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని వీడియోలు ప్రచారం అయ్యాయని.. దానిపై స్పందించిన జిల్లా పౌర సరఫరాల శాఖ స్పందించి తిలక్ నగర్ ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్లాస్టిక్ బియ్యం సరఫరా లేదని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ఇక ఇదే ఘటనపై పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా స్పందించారు. సన్న బియ్యం పంపిణీలో ఏదైనా సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు పరిష్కరిస్తారని.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ అధికారులు ప్రకటించారు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించాలని దురుద్దేశంతో తప్పుడు వీడియోలను సామాజిక మాద్యమాలలో ప్రచారం చేసే వారిని గుర్తించడంతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న సన్న బియ్యం పథకం పై కొంతమంది మీడియా,సోషల్ మీడియాలో, తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అలాంటి వాటిపై ఉపేక్షించేది లేదన్నారు.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన పలువురిపై తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సన్న బియ్యం అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్స్ లో జరా పైలం 🙏
— Devi Sharma 🇮🇳 (@sarmadevi28) April 13, 2025
గాలిమోటర్ల పోయి నీళ్లు వాటర్ మంత్రి ప్లాస్టిక్ బియ్యం పంపిణి చేసినవి, మిస్టర్ ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు మంత్రి మీ సమాధానం ఏంటి 🤔@UttamINC @KomatireddyKVR pic.twitter.com/zJeQOYdkCt