konda Surekha : అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. అర్థరాత్రి ఆమె నాగార్జున ఫ్యామిలీపై ట్వీట్ చేశారు. గతంలో తాను నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. అర్థరాత్రి ఆమె నాగార్జున ఫ్యామిలీపై ట్వీట్ చేశారు. గతంలో తాను నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 లోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది.
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,95, 610 బోనస్ ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల 500గా బోనస్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు శనివారం భారీగా నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 700 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది.
డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించనున్నట్లు తెలిసింది.