/rtv/media/media_files/2024/12/31/dK2qdKOQHc2OkZEOt1bs.jpg)
yash special request to fans
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్.. తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవరూ హోమ్‌టౌన్‌కు రావొద్దని అభిమానులను కోరారు. తనపై ఎన్నేళ్లుగా చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన యశ్.. కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు.
ఇంతకుముందు పుట్టినరోజు వేడుకల్లో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను గుర్తు చేస్తూ, ఈ సారి పుట్టినరోజు వేడుకలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నట్లు యశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన షూటింగ్ షెడ్యూల్ వల్ల అందుబాటులో ఉండలేనని, అయినప్పటికీ తన అభిమానుల ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు శక్తినిస్తాయని ఎక్స్ వేదికగా ఒక లేఖ ప్రకటించారు.
— Yash (@TheNameIsYash) December 30, 2024
Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ
అందులో 'మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నారు. కాగా 2023 జనవరి 8న జరిగిన యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మరణించారు.
ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఈసారి అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా ఫ్యాన్స్‌ను ముందు జాగ్రత్తలు తీసుకోవాలని యశ్ విజ్ఞప్తి చేశారు. యశ్ తాజాగా విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమాతో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/post_attachments/1e2b5500-d34.jpg)
Follow Us