2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధినంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి తాలిబన్లు అఫ్గాన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలను దారుణంగా అణిచివేస్తున్నారు. వాళ్లకి కనీస స్వేచ్ఛ లేకుండా కూడా చేస్తు్న్నారు. మహిళలకు సంబంధించి తాజాగా మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించకుండా కీటికీలు కూడా ఏర్పాటుచేయొద్దని తాలిబన్ పాలకులు ఆదేశించారు. Also Read: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్ ఇంటి లోపల మహిళలు తిరిగే వంట గదుల్లో గానీ, బావుల వద్ద గానీ ఎలాంటి కిటికీలు ఏర్పాటుచేయకూడదని తేల్చిచెప్పారు. మహిళలు కనిపించకుండా ఉండేందుకు గోడలు కట్టాలని చెప్పారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లల్లో ఈ రూల్ తప్పనిసరిగా అమలు చేయాలని తాలిబన్ సుప్రీం లీడర్ ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే ఈ రూల్ ప్రకారం వాటిలో మార్పులు చేయాలన్నారు. ఇలాంటి చెత్త రూల్ వల్ల అఫ్గాన్ మహిళలను మరింత అణిచివేతకు గురిచేస్తున్నారని వివిధ దేశాల ప్రజలు తాలిబన్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన ఇదిలా ఉండగా.. 2021లో అఫ్గానిస్థాన్ ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లు మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే పురుషుల తోడు లేకుండా వెళ్లకూడదు. బాలికల సెకండీ స్కూళ్లు కూడా మూసేయాలని, అసలు మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మహిళలు ఉన్న చదువులు చదువుకోవడం, ఈద్ వేడుకల్లో పాల్గొనడం, జిమ్, పార్కుల్లోకి కూడా వెళ్లడంపై నిషేధం విధించారు. తాలిబన్లు పెట్టిన ఈ ఆంక్షలపై ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది స్త్రీల పట్ల దారుణమైన వివక్ష అంటూ ధ్వజమెత్తింది. అయినప్పటికీ తాలిబన్ పాలకుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు.