Hyderabad Crime : అధికారిపై చేయి చేసుకున్న కార్పొరేటర్... జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిక!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై కేసు నమోదైంది. నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Rakesh Jaiswal

Rakesh Jaiswal

Hyderabad Crime : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై కేసు నమోదైంది. నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

GHMC Commissioner Warns On Corporator

బీజేపీకి చెందిన కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌పై అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారిపై రాకేశ్‌ జైస్వాల్‌ దాడి చేయడంతో.. ఆయనపై బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ 132, 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సెక్షన్ అధికారి తన విధి నిర్వహణలో ఉండగా, కార్పొరేటర్ ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం (బీఎన్ఎస్ సెక్షన్ 132), దాడికి పాల్పడటం (బీఎన్ఎస్ సెక్షన్ 352) వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

ఈ సంఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసిన విషయాన్ని అబిడ్స్ పోలీసులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలియజేశారు.

Also Read: పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

 

ghmc commissioner | ghmc | bjp-corporator | telangana-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు