/rtv/media/media_files/2026/02/23/fotojet-44-2026-02-23-17-20-10.jpg)
Ajay, Uday Kiran
నగరంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ఒక యువతితో పాటు ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.
Also Read : అట్టుడుకుతున్న మెక్సికో... మాఫియా డాన్ మృతితో రెచ్చిపోయిన అనుచరులు
బంజారాహిల్స్‌లో ...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బంజారాహిల్స్‌లో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం(road accident) లో బైక్‌ను వాటర్ ట్యాంకర్(Water Tanker Crash) ఢీకొనడంతో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, యువతి అక్షిత మృతి చెందారు. సయ్యద్ హుస్సేన్ సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత తీరిక సమయంలో పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు.ఈ రోజు (సోమవారం) ఉదయం అక్షిత ర్యాపిడో(rapido) ద్వారా రైడ్ బుక్ చేసుకుంది. అలా సయ్యద్ హుస్సేన్ బైక్‌పై వెళుతున్న క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్10(banjarahills incident) కు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్(water-tank) వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ప్రమాదంలో మరణించిన అక్షితను విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.
Also Read : ట్రంప్ హత్యకు స్కెచ్.. తుపాకీతో ఇంట్లోకి దూరిన యువకుడు!
షాబాద్ సమీపంలో...
ఇక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..హైతాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు చేవెళ్ల నుంచి షాబాద్‌కు ఒకే బైక్‌పై వెళ్తున్నారు. వారి బైక్ నాగర్‌గూడ చౌరస్తాకు చేరుకోగానే అదే మార్గంలో వెళ్తున్న కంటైనర్(Container).. వారు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైతాబాద్ గ్రామానికి చెందిన అజయ్(19), ఉదయ్‌కిరణ్(20) అక్కడిక్కడే మృతి చెందగా.. అజమ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన అజమ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు రోడ్డు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Follow Us