BRS : కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
నాగార్జునసాగర్ (నందికొండ మున్సిపాలిటీ) లో కోతులు మరణించిన వాటర్ ట్యాంక్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లో 30 కోతులు మరణించిన విషయం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.