BRS కొత్త పాట | BRS Party New Song Launched At 25 Years Silver Jubilee Celebrations | KCR | RTV
వరంగల్ బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహాక ప్రక్రియలో భాగంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో వివాదం రాజుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మధ్య విభేదాలు పొడ చూపాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌ను కోరారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్ గురించి పునర్‌పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కనుమ పండుగ సందర్భంగా సంగారెడ్డి గుంతపల్లి బీఆర్ఎస్ నేత అనంతరెడ్డి తన గ్రామ ప్రజలకు ఉచితంగా మటన్ పంచిపెట్టారు. 440 కుటుంబాల్లో 400 ఇళ్లకు కొత్త టిఫిన్ బాక్స్‌లలో మాంసం పంచిపెట్టారు. మిగతా 40 ఫ్యామిలీలకు నిత్యావసర సరుకులు అందించారు. వీడియో వైరల్ అవుతోంది.
TG: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు. రేపు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.
'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి'