Naveen Yadav Win: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
Congress win

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025)ల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ(congress) కార్యకర్తలు, నవీన్ యాదవ్(naveen yadav win) అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ 24,771వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.

బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డికి 17,041 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,945 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత 74,234 ఓట్లుతో రెండవ స్థానంలో ఉన్నారు. 

Also Read :  BRS ఓటమికి ఆరు కారణాలు.. కేసీఆరే అసలు కారణమా?

Jubilee Hills By-Election Results

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవంబర్ 11న పోలింగ్ నిర్వహించారు. ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. మొత్తం ఏడు డివిజన్లు ఉండగా.. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచే నుంచే నవీన్‌ యాదవ్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్‌ రౌండ్‌కూ అది మరింత పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీకు డిపాజిట్‌ గల్లంతైంది.

Also Read :  జూబ్లీహిల్స్ పై రేవంత్ 6 అస్త్రాలు.. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలివే!

Advertisment
తాజా కథనాలు