/rtv/media/media_files/2025/07/01/sigachi-chemical-explosion-2025-07-01-12-47-12.jpg)
Sigachi Chemical Explosion
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? అంటూ ప్రశ్నించారు. బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు.
Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ
సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని రేవంత్ రెడ్ది ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులకు సూచించారు.మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందించాలని సీఎం ఆదేశించారు.ఇది నష్టపరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమే అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రీట్మెంట్ ఖర్చుకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Raja Singh: రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన బీజేపీ.. షాకింగ్ కామెంట్స్!
ఇలాంటి ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని అడిగారు. ప్రమాదంపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్