Elon Musk America Party: అది జరిగితే మరిసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్

బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం వస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.

New Update
Elon Musk

Elon Musk

Elon Musk America Party:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) తీసుకొచ్చిన బిగ్‌బ్యూటిఫుల్‌ బిల్లు(Big Beautiful Bill) వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం వస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. అయితే ఇటీవల బిగ్ బ్యూటిఫుల్‌ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ బిల్లును వ్యతిరేకిస్తూ మస్క్‌ వరుసగా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. 

Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

ఈ బిల్లు సామాజిక సంక్షేమ కార్యక్రమాలు తగ్గించి అమెరికన్ల రుణాన్ని పెంచేలా ఉందని ఆరోపించారు. ఈ ప్రజాదరణ లేని బిల్లుకు సపోర్ట్ చేసే చట్ట సభ్యులకు కూడా పదవులు లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనివల్ల రుణపరిమితి 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే కొత్త రాజకీయ పార్టీ పెట్టే సమయం వచ్చిందని తెలిపారు. చట్టసభ సభ్యులపై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు.   

Also read: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం...దంచికొడుతున్న వర్షం

వాళ్లు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామంటూ ముందుగా ప్రచారం చేశారని తెలిపారు. రుణభారం పెంచే ఈ బిల్లుకు ఓటు వేస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఖర్చును పెంచే బిల్లుకు ఆమోదం లిభిస్తే మరుసటి రోజే ది అమెరికా పార్టీ ఏర్పడుతుందని తేల్చిచెప్పారు. ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాల్సిన సమయం వచ్చిందని.. ఇది ప్రజల గొంతుకగా ఉంటుందని స్పష్టం చేశారు. 

Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ

Advertisment
Advertisment
తాజా కథనాలు