/rtv/media/media_files/2025/06/30/mla-raja-singh-2025-06-30-18-44-49.jpg)
బీజేపీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇన్ని రోజులు పార్టీపై ఎన్నిసార్లు విమర్శలు చేశామని.. ఇక ఆయన ఖర్మ అని మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎంపికకు కొన్ని రోజుల ముందే రాజసింగ్ తో మాట్లాడమని కాషాయ నేతలు చెబుతున్నారు. అయినా ఆయన తీరు మార్చుకోలేదని అంటున్నారు.
స్పందించిన బీజేపీ..
రాజాసింగ్ కు బెయిల్ రావడంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ స్పందించారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఫైర్ అయ్యారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. రాజసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు లేఖ ఇవ్వాలన్నారు. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమన్నారు. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామన్నారు.