BC Reservation: బీసీ రిజర్వేషన్ మా చేతుల్లో లేదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. రిజర్వేషన్ సాధనకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశామన్నారు.

New Update
 CM Revanth Reddy

CM Revanth Reddy

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. రిజర్వేషన్ సాధనకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశామన్నారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ధిని ఎవరూ శంకించలేరు. బీసీ రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాపై బీజేపీ, BRS నేతల విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. మా కమిట్మెంట్‌కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అన్నారు. ఇక బీజేపీ కోర్ట్‌లోకి రిజర్వేషన్ మ్యాటర్ వెళ్లిందని చెప్పారు. బీసీలపై ప్రేమ ఉంటే.. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం.. బీసీలకు న్యాయమైనా వాటా కోసమే మా పోరటం పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేయడమే మా లక్ష్యమని.. ఇక ప్రధాని మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం ఈ బిల్లు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని అన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు