Revanth Reddy,KTR: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్‌ పిటిషన్‌

తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.

New Update
ktr vs revanth reddy

ktr vs revanth reddy

Revanth Reddy,KTR: తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించగా, సృజన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేసిన కేసు కొట్టివేయాలని కేటీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. వివరాల ప్రకారం..

 ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డిపై  సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్‌ భవన్‌ ముట్టడి సందర్బంగా రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.  అయితే కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Also Read :  ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!

హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు విషయంలో కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు.  సృజన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పీపీని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది.

కాళేశ్వరంపై సీబీఐకి లైన్‌ క్లియర్‌

మరోవైపు  కాళేశ్వరం కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరంపై విచారణకు సీబీఐ(CBI) కి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. తెలంగాణలో సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో గత ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఆంక్షల నుంచి ప్రస్తుత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా పారదర్శక విచారణ కోసం సీబీఐకి కేసు అప్పగించామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇదివరకే చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలుశాఖల ప్రమేయంపై, అంతర్రాష్ట్ర అంశాల పైనా దర్యాప్తు చేయాలని సీబీఐని ప్రభుత్వం కోరింది. అంతేకాదు.. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ పైనా దర్యాప్తు చేయాలని హోంశాఖకు పంపిన లేఖలో ప్రభుత్వ కోరింది.

Also read : MLA Harmeet Singh : పంజాబ్ లో కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే

Advertisment
తాజా కథనాలు