/rtv/media/media_files/2025/05/08/4XEshOc7jnOwbVByzndE.jpg)
hydra ps Photograph: (hydra ps)
Hydra Police Station Inauguration:అక్రమనిర్మాణాలు కూల్చడంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం.. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
— SocialPost Times (@socialposttimes) May 8, 2025
అనంతరం హైడ్రా సిబ్బంది కొత్త వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, వ్యాన్లు, బైక్‌లతో 80+ వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ #HYDRAA#OperationSindoorpic.twitter.com/59EPEVyQss
నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి..
ఈ మేరకు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని, 1908లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని గుర్తు చేశారు. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారని చెప్పారు.
హైదరాబాద్ లో అదే పరిస్థితి..
'మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్నాయి. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్నారు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం' అని తెలిపారు. .
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
కొందరికి దుఃఖం వస్తుంది..
చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు. హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయని, హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు.. రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోందని చెప్పారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా? నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అని ప్రశ్నించారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తోందని, నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం వస్తుందన్నారు. అలాంటి కొంతమంది తమ నిర్ణయాలను వ్యతిరేకించినా.. ప్రజలకోసం మేం వెనక్కి తగ్గేది లేదన్నారు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధైతుంది. ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుంది. ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పాకిస్తాన్‌కి చుక్కలు చూపించిన సుదర్శన్ చక్రం.. భారత్‌కు శ్రీరామ రక్షలా రష్యా S-400
అసలు కొందరి బాధ ఎంది? వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా? నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందాం. హైడ్రా అధికారులకు నా సూచన. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి అని సీఎం కోరారు.
Operation Sindoor : పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. వాటిపై నిషేదం
cm revanth | police | station | telugu-news | today telugu news