/rtv/media/media_files/2025/02/10/01IyMqEezOtBrklPwBvE.jpg)
CM Revanth called to Rangarajan
CM Revanth: చిలుకూరు బాలాజీ టెంపుల్(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్(Rangarajan) కు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. దాడిపై విచారణ జరిపి రంగరాజన్ కు మరింత రక్షణ కల్పించనున్నట్లు తెలుస్తోంది.
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్
— RTV (@RTVnewsnetwork) February 10, 2025
ఫోన్ లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించిన సీఎం.
ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం.… pic.twitter.com/ujedgcWXfU
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
పవన్ సైతం..
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. దీనిని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ను పరామర్శించాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి ఈ రోజు పవన్ కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు తెలంగాణ జనసేన నేతలు రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు, ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపన చెందుతున్న రంగరాజన్ పై దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి
కేటీఆర్ పరామర్శ..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు రంగరాజన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమైన రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ దాడి వల్ల ఎంతటి ఆవేదనలో ఉందో చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!