Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు షాక్.. ఆ కేసులో రూ.200 జరిమానా.. ఎందుకో తెలుసా!
సావర్కర్‌పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నోకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.
School Holidays: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు..!
హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణ మార్పుల కారణంగా భారీగా మంచు, వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంబా, కులు, మనాలిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. CBSE బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపింది.
Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!
ఫారిన్ కల్చర్ ఇండియాకు వచ్చేసింది. తాజాగా భారతీయ ‘గే’ జంట ఇరుకుటుంబాల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అర్జున్ కుమార్, సంచిత్ అనే ఇద్దరు వరులు పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పలువురు స్పందించి కంగ్రాట్స్ తెలిపారు.
Oscar 2025: 97వ ఆస్కార్ వేడుక.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి? - హోస్ట్ ఎవరు? పూర్తి వివరాలివే!
97వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి2న అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ వేడుకను భారతదేశంలో మార్చి 3న ఉదయం 5:30 IST నుండి ప్రారంభం అవుతుంది. దీనిని స్టార్ మూవీస్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. ఈ ఏడాది ఆస్కార్లను ఓబ్రియన్ హోస్ట్ చేస్తారు.
SSC CGL Notification: గుడ్ న్యూస్.. 'SSC'లో 18,174 ఖాళీలకు నోటిఫికేషన్..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయడానికి మొత్తం 18,174 పోస్టులను విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు - భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం!
వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం సంచలనం సృష్టించింది. అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయింది భార్య. ఈ ఘటనలో గాయపడిన సుమంత్ హాస్పిటల్లో రాత్రి మృతి చెందాడు. నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
Ap Inter Exams: మరో గంటలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం.. ఎంతమంది హాజరవుతున్నారంటే!
ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు.
Pakistan Bomb Blast: పాకిస్తాన్ స్టేడియం దగ్గరే బ్లాస్టింగ్.. 5గురు మృతి - వణికిపోతున్న క్రికెట్ జట్లు!
ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సమీపంలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. 5గురు స్పాట్లోనే మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో ఆ దేశంలో ఉన్న విదేశీ జట్లు వణికిపోతున్నాయి.