Test Tube Baby Center : తెల్లార్లు తనిఖీలు... పోలీసుల అదుపులో డాక్టర్‌

టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్టర్‌ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు.

New Update
Srusthi test tube center

Srusthi test tube center

Test Tube Baby Center:  టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో చోటు చేసుకుంది. కాగా ఈ మేరకు డాక్టర్‌నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు.

 పిల్లల కోసం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. కానీ, వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారు వైద్యురాలు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే పుట్టిన బాబుకి కేన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కి గురయ్యారు. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు దంపతులు. శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలడంతో పోలీసులను ఆశ్రయించారు దంపతులు. వారి ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

నిన్న రాత్రి ఆ సెంటర్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు రాత్రంగా తనిఖీలు చేశారు. పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం డా.నమృత ను అరెస్ట్ చేసిన పోలీసులు..రాత్రి గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంన్నారు. కాగా తనిఖీల సమయంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ సిబ్బందిని సెంటర్‌లో నే ఉంచి తెల్లార్లు ప్రశ్నించారు.  రాత్రి 2:30 గంటలకు తనిఖీలు పూర్తయిన తర్వాత సిబ్బందిని పోలీసులు పంపించివేశారు.

Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!

Advertisment
తాజా కథనాలు