/rtv/media/media_files/2025/03/27/iNONfdfyak6HINJ7HSr4.jpg)
Hyderabad Beach
బీచ్ అనగానే మనకు సముద్రం(Sea), సముద్రపు అలలు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణలు ఉన్నప్పటికీ బీచ్ లేదనే చిన్న వెలతి ఉంది. అయితే త్వరలో ఆ సంబురం కూడా తెలంగాణకు తీరనుంది. హైదరాబాద్‌కు త్వరలోనే ఒక వినూత్నమైన బీచ్ రాబోతుంది. అదేంటీ సముద్రం లేని హైదరాబాద్ కు బీచా(Hyderabad Beach) అని ఆశ్చర్య పోతున్నారా? మీరు ఎంత ఆశ్చర్యపోయినా అదే నిజం. ఇప్పటి వరకు హైదరాబాద్ వాసులు బీచ్ కి వెళ్ళాలి అంటే గోవా, వైజాగ్, కేరళకో వెళ్లేవారు. ఇంకా డబ్బులు ఉన్నవారు విదేశాల్లో ఉన్న బీచ్ లకు వెళ్లి సంతోషంగా గడిపి వస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది.
Also Read : బిహార్‌లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారో తెలిస్తే షాక్!
Hyderabad Beach Will Be Coming Soon
త్వరలోనే మనకో బీచ్ రానుంది. అయితే సముద్రమే లేని హైదరాబాద్ కు బీచ్ ఎలా వస్తుందనుకుంటున్నారా? అంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారా? మీరు ఎన్నిరకాలుగా నమ్మకున్నా.. హైదరాబాద్ కు బీచ్ త్వరలో తీసుకురానున్నారు . అయితే అది కృత్రిమ బీచ్. నగరంలోని కొత్వాల్ గూడ(adhuganj-kotwali-village)లో ఈ కృత్రిమ బీచ్ నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టనున్నారు. సముద్రం లేని నగరంలో ఒక కృత్రిమ బీచ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన పర్యాటక రంగానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ ప్రజలకే కాకుండా పర్యాటకులకు కూడా ఒక కొత్త అనుభూతి లభించనుంది.
ఈ ఆర్టిఫిషియల్ బీచ్(Artificial Beach) లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, అత్యాధునిక థియేటర్లతో పాటు వివిధ రకాల వంటకాలను అందించే ఫుడ్ కోర్టులు కూడా ఇందులో ఉంటాయి. ఈ సౌకర్యాలు బీచ్‌ను ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే కాకుండా, నగరానికి ఒక విలాసవంతమైన విడిదిగా కూడా ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్‌కు బీచ్‌ను తీసుకురావాలనే ఆలోచనతో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఈ బీచ్ నిర్మాణం వల్ల నగరానికి పర్యాటకులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని చెప్పవచ్చు. ఇక మీదట బీచ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ లోనే బీచ్ ఎంజాయ్ చేయచ్చు.