బిహార్‌లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారో తెలిస్తే షాక్!

బీహార్‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బిహార్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

New Update
Three Jaish-e-Mohammed terrorists

Three Jaish-e-Mohammed terrorists

సరిహద్దు రాష్ట్రమైన బీహార్‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో బీహార్ రాష్ట్రంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు.

నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు బార్డర్ జిల్లాలైన కిషన్‌గంజ్, అరారియా, పశ్చిమ చంపారన్‌లలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ ప్రాంతాలు నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో ఉగ్రవాదులు ఈ రూట్ ఎంచుకున్నారని అధికారులు భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, బస్టాండ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా సరిహద్దు దాటి వచ్చే వ్యక్తులపై నిఘా పెంచారు.

అనుమానితుల ఫోటోలు విడుదల

జైష్ ఉగ్రవాదుల కదలికల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, అనుమానితుల ఫొటోలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాయి. స్థానిక ప్రజలకు కూడా ఈ సమాచారం తెలిసేలా అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల చొరబాటు వెనుక పెద్ద కుట్రే ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

బీహార్‌లో టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ విస్తరించడానికి, యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ఆకర్షించడానికి, దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఈ ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ హెచ్చరిక నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ కూడా రంగంలోకి దింపింది. ఈ సంఘటనతో సరిహద్దు భద్రత, నిఘా వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది. ఉగ్రవాదుల చొరబాటుకు నేపాల్ సరిహద్దు ప్రధాన మార్గంగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు