Raja Singh: జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్లు!

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన  ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటల తూటలు వదిలారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? అంటూసెటైర్లు వేశారు.

New Update
Rajasingh satires on Kishan Reddy!

Rajasingh satires on Kishan Reddy

RAJA SINGH : తెలంగాణ రాష్ట్ర బీజేపీ(bjp) లో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(union-minister-kishan-reddy)ని టార్గెట్ చేసిన  బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటల తూటలు వదిలారు. 'కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? అంటూ సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా సోషల్ మీడియాలో మీకు జనాలు క్వశ్చన్ అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది.' అని రాజాసింగ్ వ్యాఖ్యనించారు.

Also Read: Bigg Boss 9 Telugu: ఆట మొదలెట్టిన దివ్వెల మాధురి.. భరణితో రచ్చ రచ్చ! బాల్ పట్టుకొని రీతూకి ఛాన్స్!

Jubilee Hills Election 2025

మీరు భారీ ఓట్లతో ఓడిపోతే జాతీయ నాయకులకు, కేంద్ర అధికారులకు మల్లా మీ ముఖం ఎట్లా చూపెడతారు.. కొద్దిగా ఆలోచన చేయండి సర్ అంటూ రాజాసింగ్ సూచించారు. ప్రతి ఒక్క పార్లమెంట్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క డివిజన్లో మేలు చేసే అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.  జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు.ఒవైసీ మీకు మంచి స్నేహితుడు ఆయన్ను ఆడగండి అంటూ రాజాసింగ్ సూచించారు. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.

Also Read: Cinema: రామ్ తో ప్రేమాయణం నిజమేనా? ఇన్ స్టాలో భాగ్య శ్రీ షాకింగ్ నోట్!

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. మొదటి రోజు పది నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు(congress) ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది. రాష్ట్ర పార్టీ ఇప్పటికే పార్టీ ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపగా  వారిని కాదని పార్టీ బలమైన బీసీ అభ్యర్థి పేరును పరిశీలిస్తుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో అనూహ్యంగా మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ తనయుడు, యువనేత మూల విక్రమ్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ బహిష్కృత నేత, సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

Advertisment
తాజా కథనాలు